టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించాడు. చిరంజీవి హీరో గా నటించిన ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ వెనక అత్యంత పెద్ద స్టోరీ ఉంది. ఇంతకు చిరంజీవి నటించిన ఏ ఇండస్ట్రీ హిట్ వెనక పెద్ద స్టోరీ ఉంది అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు ఇంద్ర. చిరంజీవి హీరో గా నటించిన ఈ మూవీ లో సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించాడు.
ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ కాక ముందు చాలా పెద్ద స్టోరీ నడిచినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి హీరో గా అశ్విని దత్ సినిమా చేయాలి అనుకున్న తర్వాత బి గోపాల్ ని కలిసి చిరంజీవి తో సినిమా చేయాలి అనుకుంటున్నాను. చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది వినండి. మీకు నచ్చితే ఆ స్టోరీ తో సినిమా చేద్దాం అన్నాడట. దానితో చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను బి గోపాల్ విన్నాడట.
ఇక బి గోపాల్ అప్పటికే సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేసి ఉండడం , చిన్ని కృష్ణ చెప్పిన కథ కూడా ఫ్యాక్షన్ స్టోరీ కావడంతో చిరంజీవి తో ఆ సినిమా చేయడానికి ఆయన భయపడ్డాడట. దానితో పరుచూరి గోపాల కృష్ణ ఒక రోజు నువ్వు చిరంజీవి తో చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చేయి మంచి విజయం సాధిస్తుంది అని చెప్పాడట. దానితో కన్విన్స్ అయినా బి గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవి హీరో గా ఇంద్ర అనే మూవీ ని రూపొందించాడట. ఇక ఈ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ నే అందుకుంది.