ఆ ఒక్క కారణంతో బాలీవుడ్ క్రేజీ హీరో మూవీనే రిజెక్ట్ చేసిన మీనాక్షి చౌదరి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ బ్యూటీ ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ బ్యూటీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈ నటి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది.


ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు మరియు నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అనగనగా ఒక రాజు సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నటి మరి కొంత కాలం లోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అక్షయ్ కుమార్ హీరోగా  రూపొందబోయే ఓ సినిమాతో ఈ ముద్దుగుమ్మ హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.


బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి జాన్ అబ్రహం హీరో గా రూపొందబోయే ఓ మూవీ లో మీనాక్షి చౌదరి కి  ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈమె మాత్రం ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ ఆఫర్ను రిజక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అనగనగా ఒక రాజు , నాగ చైతన్య తో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో మీనాక్షి చౌదరి కి మంచి విజయాలు దక్కినట్లయితే ఈ బ్యూటీ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc

సంబంధిత వార్తలు: