26 ఏళ్ల ఒకే ఒక్కడు : ఈ సినిమాను వదిలేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
చాలా సంవత్సరాల క్రితం అర్జున్ హీరో గా శంకర్ దర్శకత్వంలో ఒకే ఒక్కడు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. మనిషా కొయిరాలా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... లైలా ఈ మొబై్ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. రఘువరన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాను 1999 వ సంవత్సరం నవంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటి తో 26 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల 26 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం.


మొదట శంకర్ ఈ సినిమాని అర్జున్ తో కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆ సమయంలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రాజశేఖర్ తో ఈ సినిమాను చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా రాజశేఖర్ ను కలిసి ఈ మూవీ కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న రాజశేఖర్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దానితో శంకర్ ఆ తర్వాత అర్జున్ ను కలిసి ఈ మూవీ కథను వినిపించాడట. ఇక అర్జున్ కి ఈ సినిమా స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా రాజశేఖర్ రిజెక్ట్ చేసిన మూవీ లో అర్జున్ హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కంటే ముందు అర్జున్ , శంకర్ కాంబో లో జెంటిల్ మెన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: