తూచ్..బాలయ్య సినిమాలో హీరోయిన్ మారిపోయిందోచ్..గోపీచంద్ సడెన్ ట్వీస్ట్ అదుర్స్..!

Thota Jaya Madhuri
గోపీచంద్ మలినేని, గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే  వచ్చిన “అఖండ”, “వీరసింహారెడ్డి” లాంటి చిత్రాలు బాలయ్య ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో కాకుండా మరింత భారీగా, చరిత్ర సాక్షిగా నిలిచేలా ఈ కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్ ఘనంగా ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు సినిమాలో నటించబోతున్న హీరోయిన్ వివరాలు బయటకు రానున్నాయి. “తన రాణిని ఆమె వైభవంతో స్వాగతించడానికి యుద్ధభూమి సిద్ధమైంది. సామ్రాజ్యం రేపు ఆమె గంభీరమైన, శక్తివంతమైన రాకను చూసేంది…!” అంటూ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక పౌరాణిక టచ్‌తో కూడిన పోస్టర్ విడుదల చేశారు.



ఈ టీజర్ పోస్ట్ చూసిన వెంటనే సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. చాలామంది ఫ్యాన్స్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార కనిపించనుందని అంటున్నారు. గతంలో కూడా బాలయ్యతో ఆమె కెమిస్ట్రీ సూపర్‌గా వర్క్‌ అయ్యినందున ఈ వార్త ఫ్యాన్స్‌లో హై ఎక్సైట్‌మెంట్‌ క్రియేట్‌ చేసింది. అయితే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా అందాల ముద్దుగుమ్మ త్రిషను అనుకున్నారని, కానీ చివరి నిమిషంలో దర్శకుడు గోపీచంద్ ప్లాన్ మార్చి, రోల్‌కు ఎక్కువ గంభీరత, రాయల టచ్ అవసరమని భావించి నయనతారను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నయన్ ఈ పాత్రకు రాయల గ్రేస్, ఇంటెన్స్ లుక్ పర్ ఫెక్ట్ సూటవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.



ఇక కథ విషయానికి వస్తే—ఈ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ అయినప్పటికీ, దానికి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ కూడా జత కానుందని సమాచారం. బాలయ్య ఇందులో ఒక శౌర్యవంతుడైన మహారాజుగా కనిపించనున్నారు. ఆయన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా, రాయల్ లుక్‌తో, గంభీరతతో ప్రెజెంట్ చేయనున్నారట గోపీచంద్.ఈ ప్రాజెక్ట్ కోసం ప్రొడక్షన్ టీమ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని పురాతన కోటలు,  ఎడారి ప్రాంతాలు వంటి ప్రదేశాల్లో విస్తృత స్థాయి లొకేషన్ రెక్కీ చేస్తున్నట్లు తెలిసింది. సినిమాకు సంబంధించిన సెట్ డిజైన్లు కూడా అత్యంత గ్రాండ్గా ఉండబోతున్నాయి. ఈ అప్‌డేట్ బయటకు వచ్చిన వెంటనే బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా హోరెత్తించారు. “మరో బ్లాక్‌బస్టర్ బ్లాస్ట్ రాబోతుంది!”, “నయన్ – బాలయ్య కాంబో మళ్లీ మంటలు రేపుతుంది!”, “గోపీచంద్ మాస్ మిరాకిల్!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్ లెవెల్ విజువల్ స్టాండర్డ్స్‌తో, టెక్నికల్ వాల్యూ పరంగా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తీర్చిదిద్దబోతున్నారని ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: