ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన డింపుల్ హయాతి మరియు ఆమె భర్త డేవిడ్ మరోసారి వార్తల్లోకెక్కారు. వారిపై వేధింపుల ఆరోపణలతో ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వారి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ప్రియాంక బీబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షేక్ పేట్ లోని వెస్ట్ వుడ్ అపార్ట్మెంట్స్ లో డింపుల్ హయతి ఇంట్లో పని చేస్తున్న ప్రియాంక, డింపుల్ మరియు ఆమె భర్త తమను తీవ్రంగా వేధిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా తమకు సరైన ఫుడ్ పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

మంగళవారం ఉదయం జరిగిన ఒక సంఘటనతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. పెంపుడు కుక్క అరిచిందని, దానికి కారణం తానేనంటూ డింపుల్ మరియు డేవిడ్ తనను దుస్తులు విప్పి కొట్టేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపించింది. ఈ ఘటనను రికార్డ్ చేయడానికి తాను ప్రయత్నించగా, డేవిడ్ తన ఫోన్‌ను పగలగొట్టాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, తనను మరియు తన తల్లిదండ్రులను చంపేస్తామని కూడా బెదిరించారని ప్రియాంక బీబర్ పేర్కొన్నారు.

పనిమనిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై నటి డింపుల్ హయాతి మరియు ఆమె భర్త డేవిడ్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా డింపుల్ హయాతికి సంబంధించిన వివాదాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. డింపుల్ హయాతి ఈ  వివాదంలో చిక్కుకోవడంతో ఆమె అభిమానులు ఫీలవుతున్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: