హైపర్ ఆది కమెడియన్ గానే కాదు..చదువులో టాపే..పది ,ఇంటర్లో మార్కులెన్నో తెలుసా..?

Divya
టాలీవుడ్ లో కమెడియన్ గా పేరు సంపాదించిన హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా భారీగానే పాపులారిటీ సంపాదించారు. తన నుంచి వచ్చే పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయి. తన టాలెంట్ తోనే బుల్లితెర నుంచి అతి తక్కువ సమయంలో వెండితెరపై కమెడియన్ గా పేరు సంపాదించారు. అల్లరి నరేష్ నటించిన మేడమీద అమ్మాయి వంటి చిత్రంలో నటించడమే కాకుండా చిత్రానికి డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, వెంకీ మామ, సవ్యసాచి, ధమాకా, సార్ , హరిహర వీరమల్లు తదితర చిత్రాలలో కమెడియన్ గా  నటించారు.


స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అంటే అమితంగా ఇష్టపడే వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. అందుకే జనసేన పార్టీ గురించి అప్పుడప్పుడు ప్రసంగాలు చేస్తూ వైరల్ గా మారుతుంటారు. అయితే హైపర్ ఆది అటు కమెడియన్ గా టాప్ పొజిషన్లో ఉండడమే కాకుండా చదువులో కూడా టాపర్ గానే ఉన్నారు. ఇటీవలే అందుకు సంబంధించి ఒక షోలో  తెలియజేశారు హైపర్ ఆది. హైపర్ ఆది మార్కుల జాబితాను శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రదర్శించారు.SSC లో 600 మార్కులకు గాను 534 వచ్చాయి. ఇక ఇంటర్లో 1000 కిగాను 945 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాథ్స్ అయితే 75కు 75 వచ్చాయి. హైపర్ ఆది ఏడవ తరగతిలో కూడా స్కూల్ టాపర్.


ఇక ఇంటర్ తర్వాత హైపర్ ఆది ఇంజనీరింగ్ పూర్తి చేసి కొద్దిరోజులు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే అది నచ్చక నటన మీద మక్కువ ఉండడంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో ప్రస్తుతం కమెడియన్ గా పేరు సంపాదించారు. ప్రస్తుతం వరుస సినిమాలలో కమెడియన్గా నటిస్తూ ఉన్నారు హైపర్ ఆది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: