పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తాజాగా హరిహర విరమలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ లో
నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ
సినిమా ప్రారంభం అయింది. ఈ
సినిమా చాలా డిలే అవుతూ రావడంతో ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో ఆయన ఈ
సినిమా దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు. దానితో
జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. కొంత కాలం విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.
తాజాగా పవన్ "ఓజి" అనే సినిమాలో
హీరో గా నటించాడు.
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్గా నటించిన ఈ
మూవీ కి
సుజిత్ దర్శకత్వ వహించాడు. ఈ సినిమాను
సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ కి సంబంధించిన అనేక అప్డేట్లను మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పవన్ ,
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో
శ్రీ లీల ,
రాశి కన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా పవన్
కళ్యాణ్ పుట్టిన రోజు
సెప్టెంబర్ 2 వ తేదీన జరిగిన విషయం మనకు తెలిసిందే.
పవన్
కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రోజు
మూవీ యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. పవన్
కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ నుండి కూడా ఏదైనా భారీ అప్డేట్ ఉంటుందేమో అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ
సినిమా నుండి కేవలం ఒక పోస్టర్ను మాత్రమే విడుదల చేశారు. ఇక ఓజి
సినిమా విడుదలకు రెడీగా ఉండడంతో ఉస్తాది భగత్ సింగ్
మూవీ కి సంబంధించిన అప్డేట్లను
హరీష్ శంకర్ విడుదల చేయడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.