బిగ్ బాస్ 9 : అన్ని కాసిప్స్ కి తెరపడేది అప్పుడే.. అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది..?

Pulgam Srinivas
తెలుగులో బిగ్ బాస్ టెలివిజన్ షో ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించిన ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. తెలుగులో బిగ్ బాస్ ఓ టి టి లో ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇది కూడా విజయవంతంగా సక్సెస్ అయింది. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా , రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మూడవ సీజన్ నుండి కొంత కాలం క్రితం పూర్తి అయిన ఎనిమిదవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.


అలాగే జరిగిన ఒక ఓ టీ టీ సీజన్ కి కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించాడు. మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే బిగ్ బాస్ బృందం వారు అనేక ప్రోమోలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ప్రారంభం అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్లోకి వారు ఎంట్రీ ఇవ్వనున్నారు ... వీరు ఎంట్రీ ఎవరున్నారు అని అనేక వార్తలు వైరల్ అయ్యాయి.


ఇక ఆ వార్తలన్నింటికి పులిస్టాప్ పడాలి అంటే సీజన్ ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ వార్తలకు పులిస్టాప్ పడే సమయం వచ్చేసింది. తాజాగా బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ఏ తేదీ నుండి ప్రారంభం కానుంది అనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ వచ్చే ఆదివారం అనగా సెప్టెంబర్ 7 వ తేదీన రాత్రి 7 గంటలకు మొదలు కానీ ఉన్నట్లు స్టార్ మా సంస్థ తాజాగా ప్రకటించింది. ఇక బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ప్రారంభం అయితే ఇందులోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు ఎవరు అనేది క్లారిటీగా తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: