మెగా డాటర్ సుస్మిత నటించిన ఏకైక తెలుగు సినిమా .. అభిమానులను షాక్‌కు గురి చేసిన ఆసక్తికర కథ..!

Thota Jaya Madhuri
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్… ఇలా ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే, ఈ ఫ్యామిలీ నుంచి లేడీ మెంబర్స్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెడితే అభిమానుల నుంచి పెద్దగా సపోర్ట్ దక్కదు అనేది చాలా కాలంగా వినిపించే అభిప్రాయం. నిహారిక కనిదెల కెరీర్ విషయానికి వస్తే కూడా ఇదే విషయం స్పష్టమైంది. కానీ మెగా ఫ్యామిలీ నుంచి తొలి సారి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆమె చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల! ఈ విషయం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు ఈ పాత కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.



సుస్మితకు చిన్నప్పటి నుంచే సినిమాలపై మంచి ఆసక్తి ఉండేదట. చిరంజీవి కూతురిగా పెరిగిన ఆమె, సెట్‌ల వాతావరణంలో పెరిగి పెద్దదైంది. సినిమా రంగం ఎంత కష్టమో తెలుసుకున్నప్పటికీ, కెమెరా ముందుకు రావాలనే కోరిక మాత్రం ఆమె మనసులో ఉండేదట. పెళ్లి కాకముందు ఒక సినిమా లో కూడా నటించడనైకి ట్రై చేసిందట. ఆమె నిర్ణయానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అప్పట్లో టాలీవుడ్‌లో స్టార్ గా ఉన్న  డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సుస్మిత తొలి సినిమా చేయాలని నిర్ణయించారు. సినిమా ప్రాజెక్ట్‌ను కూడా ఫైనల్ చేశారు. అధికారికంగా షూటింగ్ మొదలై, మొదటి షెడ్యూల్‌లో రెండు రోజుల పాటు సుస్మిత కెమెరా ముందు నిలిచింది.



అయితే షూటింగ్ జరుగుతుండగానే, సినిమాల్లో నటించడం సుస్మితకు సరిపడదని చిరంజీవి కి అర్ధం అయిపోయిందట. తన కూతురు ఈ ఫీల్డ్‌లో కంఫర్ట్‌గా లేడని, సహజంగా నటించడం కాస్త కష్టమని ఆయనకు స్పష్టమైంది. వెంటనే కుటుంబంతో చర్చించి ఆ ప్రాజెక్ట్‌ను ఆపేసారు. దీంతో సినిమా పూర్తి కాకుండానే ఆగిపోయింది. ఆ సమయంలో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ సోషల్ మీడియా లేని కాలంలో ఈ వార్త పెద్దగా బయటకు రాలేదు. అందుకే ఈ రోజు వరకు కూడా చాలా మంది అభిమానులకు ఈ విషయం తెలియకపోవడం సహజం.



సినిమాల్లో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టే ప్రయత్నం విఫలమైన తర్వాత, సుస్మిత తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెట్ అయింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలతో సంబంధం పెంచుకుని, ఈసారి కెమెరా వెనుకకు వెళ్లింది. నిర్మాతగా పలు చిత్రాలు చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ పాత కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్గా తెరపైకి రావడానికి ప్రయత్నించిందన్న విషయం చాలా మందికి కొత్తగా అనిపిస్తోంది. మెగా అభిమానులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: