రాజమౌళి ఆఫర్ నే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమె.. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటే..!
బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా ఆమె అనుకున్నంత స్థాయి రీచ్ రాలేదు. అయితే బాహుబలి సినిమాలో అవంతిక పాత్రకు మొదటగా రాశి ఖన్నాను అనుకున్నారట. రాజమౌళి స్వయంగా ఆ పాత్ర కోసం రాశి ఖన్నాను అనుకున్నారని, ఆమెకు ఈ విషయాన్ని చెప్పగా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసిందని అప్పట్లో వార్తలు వినిపించేవి. ఆ సినిమాలో కీలక పాత్ర అనుష్కదే. సెకండ్ హీరోయిన్గా కూడా తమన్నా చేసిన పాత్ర అంతగా హైలైట్ అవ్వదని రాశి ఖన్నా ముందే ఊహించిందట. అందుకే తెలివిగా ఆ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేసిందని అప్పట్లో బయటపడింది.
అంత పెద్ద స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే ఎవరైనా టెంప్ట్ అయ్యి వెంటనే అంగీకరిస్తారు. కానీ రాశి ఖన్నా మాత్రం ఆలోచించి రిజెక్ట్ చేయడం మంచి నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి రాశి ఖన్నా ఊహించినట్లే జరిగింది. అనుష్క పాత్ర సినిమాకు హైలైట్ అయింది కానీ తమన్నా పాత్ర మాత్రం అంతగా హైలైట్ కాలేదు. అయినా తమన్నాకు మాత్రం ఈ సినిమా ద్వారా మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా "పచ్చబొట్టేసిన" పాటతో ఆమె వేరే లెవెల్ అప్రిసియేషన్ అందుకుంది. అలాంటి మంచి అవకాశం రాశి ఖన్నా మిస్ చేసుకుందని అభిమానులు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు.