బాలయ్య తర్వాత బుల్లితెరపై హవా చూపిస్తున్న జగ్గూభాయ్!

Amruth kumar
తెలివిగా టైమింగ్‌ ను క్యాచ్ చేసుకోవడంలో జగపతి బాబుకు సాటి ఎవరూ లేరు. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీగా ఉన్న జగ్గూభాయ్, కాలక్రమంలో హీరో ఇమేజ్ సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. కానీ అక్కడే ఆగిపోకుండా, “నష్టమే లాభం” అన్నట్టుగా తన కెరీర్‌కి కొత్త మలుపు ఇచ్చుకున్నాడు. ఎలాంటి నామోషీకి లోనవకుండా విలన్‌గా మారి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అదీ సాధారణ ఎంట్రీ కాదు.. నటసింహా బాలకృష్ణ సినిమా ‘లెజెండ్’ లో శక్తివంతమైన విలన్‌గా రాణించి, ప్రేక్షకుల గుండెల్లో గుద్దుకున్నాడు. బాల‌య్య తో “నువ్వా నేనా?” అని తలపడిన జగ్గూభాయ్ పెర్ఫార్మెన్స్ అందర్నీ షాక్‌కు గురిచేసింది.


 ఆ సినిమా తర్వాత వరుసగా రజనీకాంత్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ రోల్స్‌లో దూసుకుపోయాడు. ఒకప్పుడు హీరోగా పరిమితం అయిన జగ్గూభాయ్, ఇప్పుడు విలన్‌గా “స్టార్ ఆఫ్ స్టార్స్” అయ్యాడు. అంతే కాదు .. తెలివిగా గేమ్ ప్లాన్ మార్చుకున్న జగ్గూభాయ్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా హోస్ట్‌గా దుమ్మురేపుతున్నాడు. ఆహా OTTలో బాలయ్య హోస్ట్ చేసిన “అన్‌స్టాపబుల్” హిట్ తర్వాత, అదే తరహాలో ఇప్పుడు “జయమ్ము నిశ్చయమ్మురా” అనే షోతో జగ్గూభాయ్ హోస్ట్‌గా బాగానే కనెక్ట్ అవుతున్నాడు. ఆయనకు ఉన్న ఫ్రీ అండ్ ఫ్లో స్పీచ్, నిజాయితీ, సరదా, ఫన్ సెటైర్ షోకి మేజర్ హైలైట్ అవుతున్నాయి. ఈ షో ప్రత్యేకత ఏమిటంటే, సిలబ్రిటీలను మాత్రమే కాదు.. వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా ఆహ్వానిస్తూ, సర్‌ప్రైజింగ్‌గా సంభాషణలు నడపడం. ఇప్పటికే కింగ్ నాగార్జున, శ్రీలీల ఎపిసోడ్స్ డీటైల్స్ బయటకొచ్చాయి.


ఇక త్వరలో మరికొందరు అగ్రహీరోలు ఈ షోలో పాల్గొనబోతున్నారని టాక్. “కాఫీ విత్ కరణ్”, “అన్‌స్టాపబుల్” తరహాలోనే ఉన్నా, జగ్గూభాయ్ క్యారిజ్మా, ఫన్ యాటిట్యూడ్ వల్ల ఈ షో సూపర్ హిట్గా దూసుకుపోతోంది. రాజశేఖర్, శ్రీకాంత్ లాంటి తన సమకాలీన హీరోలతో పోలిస్తే, జగ్గూభాయ్ తెలివైన ఆట ఆడి, కెరీర్‌కి కొత్త కొత్త దారులు తెరుస్తూ ముందుకు సాగుతున్నాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హోస్ట్‌గా – ఏ రోల్ అయినా కవర్ చేసే మల్టీ డైమెన్షనల్ నటుడుగా నిలిచిపోయాడు. ఒక నటుడి కెరీర్‌లో లైమ్‌లైట్‌ను కొనసాగించుకోవడం, మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టు ప్లాన్ మార్చుకోవడం నిజమైన విజయమైతే, అందులో జగపతి బాబు టాలీవుడ్‌కు రోల్ మోడల్ అనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: