వార్2, కూలీ నాలుగు రోజుల కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఆ రేంజ్ లో సాధించిందా?
వార్2 మూవీ నాలుగు రోజుల్లో 37.25 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా కూలీ మూవీ మాత్రం 36.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. వార్2, కూలీ విడివిడిగా విడుదలై ఉంటే మాత్రం పరిస్థితి మరో విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నైజాం ఏరియాలో మాత్రం వార్2 సినిమాతో పోల్చి చూస్తే కూలీ సినిమానే పైచేయి సాధించడం గమనార్హం
ఫుల్ రన్ లో ఈ రెండు సినిమాలు చెరో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. నిర్మాత నాగవంశీకి వార్2 సినిమా 30 కోట్ల రూపాయల మేర నష్టాలను మిగిల్చే అవకాశాలు అయితే ఉంటాయి. వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం కష్టమేనని చెప్పవచ్చు. విపరీతమైన నెగిటివ్ టాక్ ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
మరోవైపు పైరసీ కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. రిలీజ్ సమయంలోనే పెద్ద సినిమాలకు సంబంధించి హెచ్డి క్వాలిటీ ప్రింట్ వస్తుండటం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది. వార్2, కూలీ సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనా ఆ అంచనాలను అందుకోలేదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు