పరదా పై ఆశలు పెట్టుకున్న ఆమె !
అనుపమ పరమేశ్వరన్ లీడ్ పాత్రలో నటించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ పై అనుపమ చాల ఆశలు పెట్టుకుంది. ‘శుభం’ మూవీతో దర్శకుడుగా పరిచయం అయిన ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని దర్శకుడు మీడియా ఇంటర్వ్యూలలో చెపుతున్నాడు. ఆ నమ్మకంతోనే ఈమూవీ విడుదలకు రెండు రోజుల ముందు ప్రీమియర్ షోలు వేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
తాము తీసిన సినిమా పై ఎంతో నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే దర్శక నిర్మాతలు విడుదలకు ముందు ప్రీమియం షోలు వేస్తూ ఉంటారు. ఈమూవీ దర్శకుడు గతంలో తాను తీసిన ‘శుభం’ మూవీ ప్రేక్షకులు ఎప్పుడు చూడని కథ అంటూ అంచనాలు పెంచడం అలవాటు. ఇప్పుడు ‘పరదా’ మూవీ పైన కూడ ఆదేవిధమైన అంచనాలు వస్తున్నాయి.
వాస్తవానికి సినిమా బాగుంటే ప్రేక్షకులు క్యూ కడతారు అన్న విషయం గత కొన్ని వారాల క్రితం విడుదలైన ‘మహావతార్ నరసింహ’ రుజువు చేసన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనుపమ నటించిన సినిమాలు చాలమటుకు ఫెయిల్ అవుతున్నాయి. మంచి నటిగా ఆమెకు పేరు ఉన్నప్పటికీ టాప్ యంగ్ హీరోల పక్కన ఆమెకు అవకాశాలు రావడంలేదు. ‘టిల్లు స్క్వేర్’ హిట్టయినప్పటికీ దాని వల్ల సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ పెరిగింది కానీ ఆమెకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. రవితేజతో చేసిన ‘ఈగల్’ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ‘పరదా’ మూవీ తరువాత ఈమె నటించిన ‘కిష్కిందపురి’ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలు ఆమె క్రియర్ కు అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి ప్రేక్షకులు ఆమెకు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..