తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటులలో
నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు.
చైతన్య ఓ వైపు క్లాస్ ప్లస్
రొమాంటిక్ ఏంటర్టైనర్ మూవీలలో నటిస్తూనే మరో వైపు
మాస్ ఎంటర్టైనర్ మూవీలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
చైతన్య ఆఖరుగా తండెల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా... చందు మండేటి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.
ఈ మూవీలోని నటనకు గాను
చైతన్య కు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా
చైతన్య ,
రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ టాక్ షో కు గెస్ట్ గా వెళ్లారు. ఆ టాక్ షో లో భాగంగా
చైతన్య ఓ
హీరోయిన్ గురించి ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా టాక్ షో లో భాగంగా
చైతన్య మాట్లాడుతూ ... నాకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఓ
హీరోయిన్ అంటే వణుకు పుడుతుంది. ఆమెతో నటించాలి అన్న , ఆమెతో డాన్స్ చేయాలి అన్న భయం వేస్తుంది. అంతలా నన్ను భయపెట్టిన ఆ
హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. నేను
సాయి పల్లవి కలిసి
లవ్ స్టోరీ , తండెల్ అనే రెండు సినిమాల్లో నటించాం. ఆ రెండు సినిమాల్లో కూడా తనతో డాన్స్ చేయడం , నటించడం అంటే వరకు పుట్టింది అని ఆయన చెప్పాడు.