త్రివిక్రమ్ - వెంకీ చిత్రం మొదలు ఎప్పుడంటే..?

Divya
టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా రూ.300 కోట్ల క్లబ్బులో చేరి ఏ సీనియర్ హీరోకి రాని రికార్డును సైతం తిరగరాసుకున్నారు వెంకటేష్. దీంతో చాలామంది దర్శక, నిర్మాతలు వెంకటేష్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తన తదుపరి చిత్రం మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపించాయి.దీంతో అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు.


ఇప్పటివరకు త్రివిక్రమ్  స్టార్  హీరోలతో సినిమాలను తీసి మంచి విజయాలను అందుకున్నారు. గతంలో కూడా త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి వీరు కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. ఆగస్టు నెలలో వీరి సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.


ఇప్పటికే వీరి ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిందని త్వరలో క్యాస్టింగ్ ఎంపిక చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే విషయం తెలియాలి మరి. త్రివిక్రమ్ కూడా చివరిగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాని కూడా మొదలుపెట్టలేదు త్రివిక్రమ్.మధ్యలో అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపించిన ఎందుకో సెట్ కాలేదు. మరి వెంకటేష్ తో ఎలాంటి కథను ఎంచుకొని సక్సెస్ అందుకుంటారు చూడాలి మరి త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: