తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఏదో ఒక మెసేజ్ తో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించడంలో ఈ దర్శకుడు దిట్ట .అలాంటి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తాజాగా వచ్చిన చిత్రం కుబేర .. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది.. కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు దాటి 100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ ల అంతా అద్భుతమైన కామెంట్లు పెడుతున్నారు.. ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. కుబేర సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ జరుగుతున్న సందర్భంలో అందరూ కలిసి ఒక ఫోటో దిగుతున్నారు. ఇంతలోనే మెగాస్టార్ పక్కన నిలుచున్న శేఖర్ కమ్ముల అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి భుజంపై భయపడుకుంటూనే చేయి వేశారు. ఆ తర్వాత వెంటనే ఆ చేతిని తీసేశారు.. దీన్ని గమనించిన చిరంజీవి శేఖర్ కమ్ముల చేయి తీసి మళ్ళీ తన భుజం పైన వేసుకున్నారు..
పర్వాలేదండి చేయి వేసుకోండి అంటూ శేఖర్ కమ్ములకు చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి ఎంత ఉన్నతమైన ఆలోచనతో మెదులుతారో అర్థం చేసుకోవచ్చు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి కిందిస్థాయి నుంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదిగారు.. అందుకే ఆయన నటుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తూ గౌరవం ఇస్తూ తాను గౌరవాన్ని పొందుతాడు అని చెప్పవచ్చు.