తెలంగాణ: ఆ డేట్ లోపే సర్పంచ్ ఎన్నికలు.. లేకపోతే బాగుండదంటూ హైకోర్టు సీరియస్ వార్నింగ్.?

Pandrala Sravanthi
 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం గడిచింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ అధికారుల పాలన నిర్వహించి నెలలు గడుస్తున్న ఎన్నికలపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ఓసారి మిస్ అయిపోయింది. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా  సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రతిరోజు సర్పంచులు ఆందోళన చేపడుతున్నారు.. 


ఈ విధంగా కాంగ్రెస్ పాలన నడుస్తున్న తరుణంలో సర్పంచ్ ల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ప్రజలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా చర్చించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకై కీలకమైన తీర్పు వెలువరించింది.. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు..
ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 30 లోపు తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి, ఎంపీపీలకు సంబంధించిన ఎన్నికలు కొనసాగుతాయి.


అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎంపిటిసి, జెడ్పిటీసి ఎలక్షన్స్ పెట్టి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ కు వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హైకోర్టు తీర్పుతో చాలామంది ఆశావాహులు ఎలక్షన్స్ కోసం కసరత్తులు మొదలు పెడుతున్నారు.ఊర్లలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా అధికార పార్టీ నేతలు  నాయకులు అండతో ఎలాగైనా గెలిచి సత్తా ఏంటో చూపించాలని ఉవ్విల్లురుతున్నారు. అంతేకాకుండా  కాంగ్రెస్ కు ఉన్నటువంటి మైనస్ ను ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలు ఎలాగైనా స్థానిక సంస్థలు కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: