టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `SSMB29` వర్కింగ్ టైటిల్ తో ఓ బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. అఫ్రికన్ అడవులు నేపథ్యంలో జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపిక అయింది. మలయాళ స్టార్ ప్రిథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నాడు.
ఈ ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లిన ఎస్ఎస్ఎమ్‌బీ 29 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కెన్న్యా, ఒడిశా, ఇటలీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జక్కన్న చిత్రీకరణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. మహేష్ బాబు మూవీలో మల్టీటాలెంటెడ్ యాక్టర్ మాధవన్ కూడా భాగం కాబోతున్నాడట.
రీసెంట్ లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రాజమౌళి టీమ్ మాధవన్ ను సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పారట. త్వరలోనే మాధవన్ షూటింగ్ లో జాయిన్ కానున్నడని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా నటీనటుల సెలక్షన్ లో జక్కన్న ప్లానింగ్ కు సినీ ప్రియుల మైండ్‌బ్లాక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, దుర్గా ఆర్ట్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ ఈ సినిమాను దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడెక్షన్ వర్క్ అనుకున్న ప్రకారం కంప్లీట్ అయితే మహేష్ బాబు, రాజమౌళి మూవీ 2027 ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు