విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.జే సూర్య కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా.. ఈయన దర్శకత్వంలో ఖుషి లాంటి బ్లాక్బస్టర్ హిట్ వచ్చింది. అయితే అలాంటి ఎస్ జే సూర్య ప్రస్తుతం విలన్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే తాజాగా సూర్య తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసి చాలామంది నెటిజన్లు ఎందుకు నానిని సూర్య క్షమాపణలు అడుగుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ సూర్య నానిని ఎందుకు క్షమించమని కోరారు అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఇందులో భాగంగా 2014 నుండి ఇప్పటివరకు ఉత్తమ చిత్రాలను కూడా ఎంపిక చేసింది.
అయితే 2024 లో విడుదలైన సరిపోదా శనివారం మూవీ లో నటించిన ఎస్ జే సూర్యకి ఉత్తమ సహాయ నటుడి అవార్డు వచ్చింది. ఇక సరిపోదా శనివారం మూవీలో నాని కంటే సూర్యనే బాగా నటించారని, ఈ సినిమాలో ఎస్ జె సూర్య నటన అమోఘం అని ఎంతో మంది మెచ్చుకున్నారు. అలా ఇందులో హీరోకి తగ్గట్టు విలన్ పాత్ర కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఎస్ జే సూర్య నటనకి గానూ ఉత్తమ సహాయ నటుడు అవార్డు రావడంతో నాని ఎస్ జే సూర్యకి విష్ చేశారు.అయితే నాని చేసిన విష్ కి రిప్లై గా చాలా సింపుల్ గా ధన్యవాదాలు నాని గారు అంటూ ఒక చిన్న రిప్లై ఇచ్చారు.
అయితే ఆ తర్వాత మళ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు సూర్య. నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంవల్ల సరిగ్గా స్పందించలేకపోయాను. కానీ ఇప్పుడు స్పందిస్తున్నాను. క్షమించండి షూటింగ్ వల్ల సరిగ్గా స్పందించలేకపోయాను.. మీరు డైరెక్టర్ వివేక్ ఇద్దరు నాకు సపోర్ట్ గా నిలవకపోతే నేను ఈ పాత్ర చేసే వాడిని కాదు. మీకు ఓన్లీ థ్యాంక్స్ సార్ అని చెబితే సరిపోదు.మీరు సినిమాలో మాత్రమే కాదు రియల్ హీరో ..మీ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది..అంటూ ఎస్ జె సూర్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎస్ జే సూర్య చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.