రీరిలీజ్ సినిమాలతో సైతం సంచలన రికార్డులు.. మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమా?
కేవలం 24 గంటల్లోనే 25 వేలకు పైగా టికెట్లు అమ్ముడై ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా రీరిలీజ్ డే1 కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బుల్లితెరపై ఎన్నోసార్లు ప్రసారమైన సినిమాకు థియేటర్లలో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం అంటే మామూలు విషయం అయితే కాదు. మహేష్ బాబుకు లేడీస్ లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టైర్2, టైర్3 ఏరియాలలో సైతం ఖలేజా మూవీ బుకింగ్స్ విషయంలో సంచలనాలను కొనసాగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సితార తన స్నేహితులతో కలిసి ఈరోజు ఏఎంబీ మాల్ లో ఖలేజా సినిమాను చూడనున్నారని తెలుస్తోంది. పోకిరి, మురారి సినిమాలు రీరిలీజ్ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేయగా ఖలేజా సైతం ఆ జాబితాలో చేరే ఛాన్స్ అయితే ఉంది.
ఖలేజా సినిమా రీరిలీజ్ వెర్షన్ లో కొన్ని సాంగ్స్, సీన్స్ కట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఒక్క విషయంలో మహేష్ అభిమానులు కొంతమేర అసంతృప్తికి గురవుతున్నారని తెలుస్తోంది. ఖలేజా ఇప్పుడే డైరెక్ట్ గా రిలీజై ఉంటే ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రాజమౌళి సినిమాతో కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.