అపోలో హాస్పిటల్స్ లో డాక్టర్ .. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్..!

Amruth kumar
ఇక మన చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో  చేసింది తక్కువ సినిమాలే అయినా .. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో భారీ స్టార్డం తెచ్చుకున్నారు .. అలాగే కొంతమంది కోట్లు వెనకేసుకుంటున్నారు .. మరి కొంతమంది మాత్రం ఎక్కడా కనిపించకుండా పోతున్నారు .. ఇక ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా ? ఆమె ఇప్పుడుప్పుడే హీరోయిన్గా మంచి క్రేజ్‌ తెచ్చుకుంటుంది .. చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్గా మారి సక్సెస్ అవుతున్నారు .. అలాంటివారీలోఈ బ్యూటీ కూడా ఒకరు .. చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా ఎదిగింది .. అంతేకాకుండా తన అందం నటనతో ప్రేక్షకులను ఎంతగానో  ఆకట్టుకుంది .. ఇంతకీ ఈమె ఎవరంటే ..



ఇక పై ఫోటోలో ఉన్న ఈ హాట్ బ్యూటీ మరెవరో కాదు .. కామాక్షి భాస్కర్ల .. ఇక ఇది ముద్దుగుమ్మ చైనాలో ఎంబిబిఎస్ చదివి .. అపోలో హాస్పిటల్స్ లో కొంతకాలం డాక్టర్‌గా పనిచేసింది .. ఇక తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది కామాక్షి .. ఇక తన సినీ జీవితాన్ని 2019లో ప్రియురాలు అనే సినిమాతో మొదలుపెట్టింది .. అయితే ఈమెకు నిజమైన గుర్తింపు 2021 లో విడుదలైన మా ఊరి పొలిమేర అనే సినిమాతో వచ్చింది .. ఇక ఈ హారర్-థ్రిల్లర్ సినిమాలో ఈమె నటన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .. ఇక తర్వాత పొలిమేర 2 లో కూడా లక్ష్మీ పాత్రలో నటించి మరింత ప్రశంసలు అందుకుంది .. ఇక ఈ సినిమాలో ఈమె నటనకే గాను 2024లో న్యూఢిల్లీలో జరిగిన 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటిగ‌ అవార్డు కూడా అందుకుంది ..



అలాగే కామాక్షి విరూపాక్ష , ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం ,  ఓం భీమ్ బుష్ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది వీటితో పాటే ఝాన్సీ , సైతాన్ , దూత వంటి వెబ్ సిరీస్ లు కూడా చేసింది .. కామాక్షి తన కెరీర్లో భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ఎదుగుతుంది .. హారర్ థ్రీల్లర్ కామెడీ తరహా సినిమాల్లో తన సత్తా చాటుకుంటుంది .. అలాగే 2018లో ఈమె మిస్ తెలంగాణ టైటిల్ కూడా గెలుచుకుంది .. మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్ వరకు వెళ్లింది. ప్ర‌స్తుతం కామాక్షి పొలమేరా 3లో సహా మరో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది .. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో తరచూ అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తుంది .. అలాగే ఈ బ్యూటీ నిఅభిమానులు  “క్వీన్ ఆఫ్ హారర్ థ్రిల్లర్స్”గా అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: