ప‌వ‌న్ కార‌ణంగా డిజాస్ట‌ర్ అయిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా?

Kavya Nekkanti
థియేటర్స్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉన్నప్పుడు పక్కన మరో మంచి చిత్రం వచ్చినా నిల‌దొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఆ బ్లాక్ బస్టర్ సినిమా టాప్ హీరోలదైతే దాని హవా వేరె లెవెల్ లో ఉంటుంది. అలా ఒక హీరో సినిమా కారణంగా మరొక హీరో సినిమా ప్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటువంటి సంఘటన మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో కూడా జరిగింది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణంగా రవితేజ నటించిన మూవీ ఒక‌టి డిజాస్టర్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `దరువు`. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన `గబ్బర్ సింగ్` చిత్రం 2012 మే 11న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాదాపు 50 రోజులపాటు ఏ సినిమా వచ్చిన నిలబడలేకపోయింది. ఈ జాబితాలో ద‌రువు కూడా ఒకటి.
శివ డైరెక్ట్ చేసిన దరువు చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. తాప్సీ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యమలోకం నేప‌థ్యంలో శ్రీ వేంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ మూవీ 2012 మే 25న విడుదలైంది. స్టోరీ రొటీన్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌టంతో ఓ వ‌ర్గం ఆడియెన్స్ నుండి ద‌రువు చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. కానీ గ‌బ్బ‌ర్ సింగ్ మ్యానియాలో ర‌వితేజ ద‌రువు స‌రిగ్గా పెర్ఫార్మ్ చేయ‌లేకపోయింది. ఫ‌లితంగా హిట్ అవ్వాల్సిన చిత్రం డిజాస్ట‌ర్ గా మిగిలింది. అన్నట్లు ద‌రువు విడుద‌లైన నిన్న‌టికి 13 ఏళ్లు. ఈ సినిమాకు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఆంటోని సంగీతం అందించ‌డం మ‌రొక విశేషం.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: