నేను ఆ నటుడిని చూసి అసూయపడతాను.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్
అయితే ఈ సినిమా ఆడియో ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఆ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా కన్నడ సూపర్ స్టార్ శివ కుమార్ హాజరయ్యారు. ఆయన ఒక అతిథిగా కాకుండా.. కమల్ హాసన్ అభిమానిగా, ప్రతినిధిగా ఈవెంట్ కి వచ్చినట్లు తెలిపారు. అలాగే డైరెక్టర్ కామ్ యాక్టర్ జోజు జార్జ్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. యాక్టర్ జోజు జార్జ్ ఇరట్ట సినిమాలో చేసిన ద్విపాత్రాభినయం తనని ఆశ్చర్యపరిచిందని తెలిపారు. తాను అసూయపడే నటుల్లో జోజు జార్జ్ కూడా ఒకరని ఆయన వైపు చూస్తూ చెప్పారు. ఇక ఇది విన్న నటుడు జోజు జార్జ్ ఆనందంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
ఇకపోతే కమల్ హాసన్ సీనియర్ హీరో అయినప్పటికీ కుర్ర హీరోలకు సైతం ఇండస్ట్రీలో పోటీ ఇస్తున్నారు. నిజానికి కమల్ హాసన్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోను ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతీయుడు సినిమాలో కమలహాసన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూస్తుంటారు.