లేటు వయసులో పెళ్లి.. విశాల్ ఇంత ఆలస్యం చేయడం వెనుక అంత కథ ఉందా?
అయితే విశాల్, సాయి ధన్షిక మధ్య దాదాపు 15 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. అలాగే గత ఐదేళ్ల నుంచి ధన్షికతో విశాల్ ప్రేమాయణం సాగిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం విశాల్ ఎందుకింత ఆలస్యం చేశాడు? అనే డౌట్ చాలా మందికి ఉంది. ప్రస్తుతం విశాల్ ఏజ్ 47. అంటే ఆల్మోస్ట్ ఐదు పదుల వయసుకు చేరువవుతున్నాడు. ధన్షికతో రిలేషన్లో ఉండి కూడా విశాల్ లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వెనుక కారణం నడిగర్ సంఘం బిల్డింగ్.
విశాల్ నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న టైమ్‌లో.. సంఘం కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. బిల్డింగ్ కట్టాక అందులోనే తన పెళ్లి జరుగుతుందని ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి, న్యాయపరమైన వివాదాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఈ భవనం నిర్మాణం పలుమార్లు నిలిచిపోయింది. అయినప్పటికీ విశాల్ తన నిర్ణయం మార్చుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌ను తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారు.
2017లో ప్రారంభమైన నడిగర్ సంఘం బిల్డింగ్ ఫైనల్ గా తొమ్మిదేళ్లకు పూర్తైంది. చెన్నై నడిమధ్యన టి.నగర్ ప్రాంతంలో, హబీబుల్లా రోడ్‌పై కల్చరల్ అండ్ కమర్షియల్ కంప్లెక్స్గా ఈ భవనాన్ని నిర్మించారు. సినిమా ప్రీమియర్స్, నాటకాలు, ఫిల్మ్ ఫంక్షన్ల కోసం 1000+ సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం, ప్రదర్శన హాల్స్, ఫంక్షన్ హాల్స్, మల్టిప్లెక్స్ థియేటర్లతో బిల్డింగ్ ను రూపొందించారు.
అలాగే బిల్డింగ్ లోపల శాపింగ్ కాంప్లెక్స్, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆదాయాన్ని నడిగర్ సంఘం అభివృద్ధికి, కళాకారుల సంక్షేమానికి ఉపయోగించనున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం 2025 ఆగస్టు 15న జరగనుంది. ఇక నడిగర్ సంఘం బిల్డింగ్ కంప్లీట్ కావడంతో విశాల్ సైతం తన ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిపోయాడు. అదన్న మాట కథ!