సినీ పరిశ్రమలో రాణించాలంటే గ్లామర్, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. లేదంటే అంతే సంగతులు. సక్సెస్ లేకపోయిన కొందరు తారలు చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంటారు. ఇంకొందరు హిట్ పడ్డా ఆఫర్లు లేక అల్లాడిపోతుంటారు. ఈ రెండో కోవకు చెందిన బ్యూటీనే శాన్వి శ్రీవాస్తవ. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించిన శాన్వి.. 2012లో `లవ్లీ` మూవీతో హీరోయిన్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
బి. జయ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆది సాయికుమార్ హీరోగా నటించాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన లవ్లీ మూవీ మంచి విజయం సాధించింది. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది శాన్వి. అయితే తొలి సినిమాతోనే హిట్ కొట్టినప్పటికీ.. టాలీవుడ్ లో శాన్వికి ఆఫర్లు నిల్ అనే చెప్పుకావాలి. లవ్లీ అనంతరం `అడ్డా`, `రౌడీ`, `ప్యార్ మే పడిపోయానే` వంటి చిత్రాల్లో శాన్వి నటించింది.
ఆ తర్వాత శాన్వికి మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చిందే లేదు. చాలా కాలం టాలీవుడ్ లో ఆఫర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ కొంత నిలదొక్కుకుంది. ఇక చాలా కాలానికి 2019లో `అతడే శ్రీమన్నారాయణ` డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పరిష్కరించింది. ఆ టైమ్‌లో శాన్వి స్టేజ్ పై మాట్లాడుతూ.. తెలుగు అవకాశాలు రాకపోవడం పట్ల కన్నీళ్లు పెట్టుకుంది. తెలుగులో తనకు ఎందుకు ఆఫర్లు రావడం లేదో అర్థం కావట్లేదంటూ ఏడ్చేసింది. అయినా లాభం లేదు. తెలుగు దర్శకనిర్మాతలు శాన్వి వైపు కన్నెత్తి చూసింది కూడా లేదు. ప్రస్తుతం శాన్వి శ్రీవాస్తవ కన్నడలోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను సాగిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు