డిజాస్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో మ‌హేష్ వ‌న్స్ మోర్‌.. దేవుడా ఇక నువ్వే కాపాడాలి!

Kavya Nekkanti
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ` ఎస్ఎస్ఎమ్‌బీ` వ‌ర్కింగ్ టైటిల్ తో ప్రారంభ‌మైన యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా ఎంపిక అయింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలనే లక్ష్యంతో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.


అయితే జ‌క్క‌న్న‌తో సినిమా చేశాక మహేష్ నెక్స్ట్ ఏ డైరెక్ట‌ర్ తో ఉంటుంద‌న్న చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. రాజ‌మౌళి సినిమా త‌ర్వాత మ‌హేష్ ఇమేజ్ మారుతుంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వ‌స్తుంది. సో.. నెక్స్ట్ కూడా అదే రేంజ్ సినిమా చేసే డైరెక్టర్ తో చేతులు క‌ల‌పాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా, సుకుమార్‌, నాగ వంశీ వంటి డైరెక్ట‌ర్లు ఉన్నారు. వీరిలో మ‌హేష్ బాబు చూపు సుకుమార్ వైపు ఉన్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.


ఇప్ప‌టికే ` పుష్ప 1`, ` పుష్ప 2` చిత్రాల‌తో సుకుమార్ త‌న స‌త్తా ఏంటో జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే మంచి స్టోరీ కుదిరితే రాజ‌మౌళి త‌ర్వాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించే ఆలోచ‌న‌లో మ‌హేష్ బాబు ఉన్నారు. అయితే గ‌తంలో సుకుమార్‌, మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ ` 1-నేనొక్క‌డినే` ఘోర‌మైన ఫ‌లితాన్ని మూట‌గ‌ట్టుకుంది. మ‌హేష్ బాబు కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు డిజాస్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్ తోనే మ‌హేష్ బాబు వ‌న్స్ మోర్ అటుండ‌డంతో దేవుడా ఇక నువ్వే కాపాడాలి అంటూ సినీ ప్రియులు, అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: