చిరు వీర కుమ్ముడు.. ` జగదేకవీరుడు అతిలోకసుందరి ` వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా నటించిన కల్ట్ బ్లాక్ బస్టర్ ` జగదేకవీరుడు అతిలోకసుందరి ` మూడున్నర దశాబ్దాల అనంతరం రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2డీ, 3డీ ఫార్మాట్లలో మే9న మళ్లీ ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. అయితే రీరిలీజ్ లోనూ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం మెగా ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ ఎగబడుతున్నారు. దాంతో కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద చిరు వీర కుమ్ముడు కుమ్ముతున్నారు. వీకెండ్ ముగిసే సమయానికి జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం నైజామ్ లో రూ. 82 లక్షలు, సీడెడ్ లో రూ. 24 లక్షలు మరియు ఆంధ్రాలో రూ. 90 లక్షల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఏపీ మరియు తెలంగాణలో మూడు రోజుల్లో రూ. 1.96 కోట్ల గ్రాస్ వచ్చింది.
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో రూ. 44 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం టోటల్ గా సాధించిన వీకెండ్ గ్రాస్ కలెక్షన్స్ రూ. 2.40 కోట్లు. పోటీగా సమంత నిర్మించిన ` శుభ్రం `, శ్రీవిష్ణు హీరోగా యాక్ట్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ ` సింగిల్ ` వంటి చిత్రాలు ఉన్న కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిందంటే ఎక్స్ లెంట్ గా పర్ఫార్మ్ చేసిందనే చెప్పొచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు