టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అనే హిందీ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అయినటువంటి హృతిక్ రోహన్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే వార్ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వార్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఇలా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీ తెలుగు హక్కులకు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క తెలుగు హక్కుల కోసం ఓ ఇద్దరు క్రేజీ నిర్మాతలు అత్యంత భారీ స్థాయిలో పోటీ పడుతున్నట్లు , అలాగే వారు భారీ ఎత్తున ధరను చెల్లించి ఈ సినిమా యొక్క తెలుగు హక్కులను దక్కించుకోవడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలు అయినటువంటి సునీల్ నరంగ్ , సూర్య దేవర నాగ వంశీ ఇద్దరు కూడా వార్ 2 సినిమా యొక్క తెలుగు హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే వీరిద్దరూ కూడా ఈ మూవీ యొక్క తెలుగు హక్కుల కోసం 85 నుండి 120 కోట్ల వరకు డబ్బులు పెట్టడానికి కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన ఇద్దరు నిర్మాతలు వార్ 2 సినిమా యొక్క తెలుగు వర్షన్ హక్కుల కోసం భారీ ఎత్తున పోటీ పడుతూ నట్లు తెలుస్తోంది. మరి వార్ 2 సినిమా తెలుగు హక్కులను ఎవరు దక్కించుకుంటారో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.