ఎన్టీఆర్ హిందువు కాదు ముస్లిం.. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్.?

Pandrala Sravanthi
 ఏంటి జూనియర్ ఎన్టీఆర్ హిందువు కాదా.. ముస్లిమా.. ఇన్ని రోజులు ఈ విషయం మాకు తెలియదే అనుకుంటారు చాలామంది నెటిజన్లు..మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం అనే వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అనగా సీనియర్ ఎన్టీఆర్ మనవడు.. హరికృష్ణ రెండో భార్య శాలినికి పుట్టిన కొడుకే జూనియర్ ఎన్టీఆర్.. ఇక ఎన్టీఆర్ అనే పేరుని కూడా సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా తన మనవడికి పెట్టారు. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇండో-పాక్ వార్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. పుట్టినప్పటి నుండి నందమూరి ఫ్యామిలీకి దూరంగా పెరుగుతున్న ఈయన ఆ మధ్యకాలంలో వీరిని కలుపుకున్నప్పటికీ మళ్ళీ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ వీరిని దూరం పెడుతూనే ఉంది. 


కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎవరు ఎంత దూరం పెట్టినా కూడా కేవలం తన ప్రతిభా టాలెంట్ తోనే ఇండస్ట్రీలో స్టార్ గా మారారు. గ్లోబల్ హీరోగా తన రేంజ్ ఏంటో చూపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నారు. ఈయనపై సోషల్ మీడియాలో కొంతమంది జనాలు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ని అంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ హిందువు కాదు ముస్లిం అని ఆయన అసలు పేరు నందమూరి తారక రామారావు కాదు మహమ్మద్ సరీబ్ రసూల్ ఖాన్ అని, మొదట ముస్లిం మతంలో ఉన్న ఎన్టీఆర్ కి పేరు మార్చుకున్నాకే అంతా కలిసి వచ్చిందని, అందుకే ముస్లిం గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ హిందువుగా మారిపోయారని, ఆయన ముస్లిమేనని చాలామంది సోషల్ మీడియాలో ఈయనపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. 


అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం గెటప్ వేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ ఈయన ముస్లిమేనా అని హిందూ కాదు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ముస్లిం కాదని,హిందూ అని ఎన్నోసార్లు గుడికి వెళ్లారు.బహుశా ఈ ట్రోల్స్ చేసే వారికి కళ్ళు కనిపించలేదు కావచ్చు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని ముస్లిం అని నెగిటివ్ ముద్ర వేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ ఇండో-పాక్ వార్ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: