బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో పాక్‌ను తుక్కు చేస్తోన్న భార‌త్ ఆర్మీ...!

Amruth kumar
ఇండియన్ దెబ్బ అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్  ఇప్పుడు రుచి చూస్తున్నట్లు ఉంది . సైలెంట్ గా ఉండే భారత్ ను గెలికితే ఎలా ఉంటుంది ..? అనేది ఇప్పుడు పాకిస్తాన్ కి బాగా తెలిసి వచ్చింది.  ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్ "ఆపరేషన్ సింధూర్" . నరేంద్ర మోడీ తీసుకున్న డెసిషన్ కి యావత్ భారతదేశం సెల్యూట్ చేస్తుంది . మరీ ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ నిద్ర తిండి లేకుండా 24/7 పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని కాపాడుతూనే వచ్చింది. భారత్ ఎంతో సమ్యవనం  పాటిస్తూ వచ్చిన భారత్ పై లేనిపోని నిందలు వేస్తూ కవ్వింపు చర్యలకు  పాల్పడుతూ పాకిస్తాన్ రెచ్చగొడుతుంది .



భారత్ పై ఒక దుష్ప్రచారం చేస్తూ కావాలని దాడులకు దిగుతుంది . ఏప్రిల్ 22వ తేదీ జరిగిన పెహల్గాం  దాడులే తొలి కవ్వింపు చర్యలు అని అందరికీ తెలిసిందే.  కాగా ప్రెసెంట్ భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల మధ్య వాతావరణం ఎంత హీట్ పెంచేస్తుందో అందరికీ తెలుసు. పెహల్గం అటాక్ తర్వాత దానికి కౌంటర్ గా భారత్ పాక్  సైన్యానికి పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉగ్రస్ధావరాల పైన దాడి చేసింది.  వాళ్లను అంతం చేసింది . అయితే పాకిస్తాన్ మాత్రం కావాలనే కొన్ని నిందలు వేసి ఇండియా పై దారుణంగా విరుచుకుపడుతుంది .



ఇండియా వైపు పాక్ మిస్సైలు దూసుకు వస్తున్నాయి. అయితే అలర్ట్ గా ఉన్న ఇండియన్ ఆర్మీ పాక్ మిస్సైలను  గగనతనంలోనే ధ్వంసం చేస్తున్నాయి.  దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాహోర్ లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా భారత ధ్వంసం చేసేసింది . పాకిస్థాన్ లో పలు నగరాలపై మిస్సైల్ దాడులు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి . ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ధర్మ సమ్మతమైన ఉగ్రవాదులను అణిచివేసే చర్య అని అయితే పాకిస్తాన్ మాత్రం కావాలని ఇండియన్ జనాలు టార్గెట్గా చేసుకొని ఇండియా పై మిస్సైల్స్ వదులుతుంది .  దానిని ఇండియన్ ఆర్మీ చక్కగా తిప్పి కొడుతుంది .



అయితే భారత్ ప్రదర్శించబోయే విశ్వరూపానికి ఇది జస్ట్ టీజర్ మాత్రమే అని ..ట్రైలర్ రిలీజ్ అయితే బొమ్మ వేరేలా ఉంటుంది అని ..బ్రేకింగ్ పాయింట్ దాటితే భారత్ సహనాన్ని పరీక్షిస్తే ఖచ్చితంగా వాళ్లకి దబిడి దిబిడే అవుతుందని పాకిస్తాన్ వాళ్ళు అన్ని మూసుకుని కూర్చుంటే బెటర్ అంటూ ప్రముఖులు ..అలాగే పలువురు ఇండియన్స్ ఘాటుగా  పాకిస్తానీలకు హెచ్చరిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: