కిల్లింగ్ లుక్స్ తో కుర్రాలను కట్టిపడేస్తున్న శ్రీనిధి శెట్టి..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం , అంతకుమించిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ సాలిడ్ విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మలలో శ్రీ నిధి శెట్టి ఒకరు. ఈమె కన్నడ సినిమా అయినటువంటి కే జీ ఎఫ్ చాప్టర్ 1 తో నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.


ఆ తర్వాత ఈమె కే జీ ఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 లో కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అలా కెరీర్ ను మొదలు పెట్టిన మొదట్లోనే సూపర్ సాలిడ్ విజయాలను , అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ నటుడు విక్రమ్ హీరోగా రూపొందిన కోబ్రా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈమె నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది.


కొన్ని రోజుల క్రితం విడుదల ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టికి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: