ఫరియా అబ్దుల్లా ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ జాతి రత్నాలు బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. థియేటర్ ఆర్టిస్ట్ గా మంచిపేరు సంపాదించుకున్న ఫరియా అబ్దుల్లా నాగ్ అశ్విన్ కంట పడటంతో జాతి రత్నాలు ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాలో తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకంగా కనిపిస్తూ కామెడీని పండించింది. టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టికి సమానంగా నటిస్తూ జాతిరత్నాలు హిట్ కావడంలో కీలకంగా వ్యవహరించింది. ఎంతో అందంగా ఉన్నా ఈ పొడుగు కాళ్ల సుందరికి తన ఎత్తే శాపంగా మారింది. దీంతో ఆఫర్లు పెద్దగా రావట్లేదనే చెప్పాలి.
జాతి రత్నాలు తరవాత కొన్ని సినిమాలు చేసినా అవి కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఫరియా తన కెరీర్ నే రిస్క్ లో పెట్టి ఓ సినిమాను చేస్తోంది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా గుర్రం పాపిరెడ్డి అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా డార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. తెలుగులో ఇప్పటివరకు డార్క్ కామెడీ నేపథ్యంలో సినిమాలు రాలేదు.
ఎక్కువగా ఇలాంటి సినిమాలు ఇంగ్లీష్ లో వస్తుంటాయి. ఫరియా అబ్దుల్లా ఇలాంటి సినిమా చేయడం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్లో కొంతమంది డార్క్ కామెడీ చేయడంతో వారిపై కేసులు సైతం నమోదయ్యాయి. మన ప్రేక్షకులకు డార్క్ కామెడీ అంటే భూతు అనే అభిప్రాయం ఉంది. దీంతో ఇప్పుడు ఇలాంటి రిస్క్ అవసరమా చిట్టి అని ఫరియా అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో అగస్త్య హీరోగా నటిస్తుండగా మురళి మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. అగస్త్య వికటకవి వెబ్ సిరీస్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. మరి డార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న గుర్రం పాపిరెడ్డి తెరపైకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి.