శ్రీనిధి ఆశలను నాని తీర్చగలడా !

Seetha Sailaja
‘కేజీ ఎఫ్’ మూవీతో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆతరువాత ఆమె నటించిన అనేక సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళలేకపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఆమె నానితో కలిసి నటిస్తున్న ‘హిట్ 3’ మూవీతో తనకు అదృష్టం కలిసి వస్తుందని ఆమె చాల ఆశలు పెట్టుకుంది.


దీనికితోడు ఈమూవీని నాని దేశవ్యాప్తంగా అనేక నగరాలు తిరుగుతూ ప్రమోట్ చేయడమే కాకుండా అమెరికాలో ఈమూవీని ప్రమోట్ చేయడానికి ప్రస్తుతం నాని ఆమెరికలో ఉన్నాడు. నానికి అమెరికాలోని తెలుగు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ రీత్యా ‘హిట్ 3’ భారీ ఓపెనింగ్స్ వస్తాయని శ్రీనిధి శెట్టి భావిస్తోంది. ఈమూవీ తరువాత ఆమె సిద్దూ జొన్నల గడ్డతో కలిసి నటిస్తున్న మూవీ ‘తెలుసు కదా’ తో తనకు మూవీతో మరింత పాపులారిటీ వస్తుందని ఆఆమె భావిస్తోంది.


ఈ రెండు సినిమాలు చేస్తున్న సమయంలోనే శ్రీనిధికి భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తీస్తున్న ‘రామాయణం’ లో సీత పాత్ర చేసే అవకాశం వచ్చిందట. ఈ సీత పాత్రకు శ్రీనిధి ఎంతవరకు సరిపోతుంది అన్నవిషయం తెలుసుకోవడానికి ఆమూవీ దర్శకుడు ముకేష్ దివాలి శ్రీనిధి చేత రెండు సీన్స్ లో టెస్ట్ ఘాట్ కూడ చేశాడట. అయితే ఆమె ఎంతో కష్టపడి ఆరెండు సన్నివేశాలలో నటించినప్పటికీ ఆతరువాత సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేశారు అన్న వార్త విని తాను షాక్ అయినట్లు చెప్పింది.


అంతేకాదు సీత పాత్రలలో భావోద్వేగాలు చాల ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత బరువైన పాత్రను తాను కష్టపడి చేసినా గుర్తింపు రాదు అన్న ఉద్దేశంతో తన స్థానంలో సాయి పల్లవిని ఎంపిక చేశారు అని చెపుతోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా నాని నటించిన ‘హిట్ 3’ మూవీలో శ్రీనిధి పాత్ర చాల కీలకంగా ఉంటుంది అన్న వార్తాలు వస్తున్నాయి. ఆమె చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుంది కాబట్టి ఏఏమూవీ తరువాత ఆమెకు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి భారీ అవకాశాలు రావడం ఖాయం అన్న కామెంట్స్ వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: