టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి
రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు భారీ ఫ్లాప్ లను ఎదుర్కొన్నాయి. ఆ మూడు సినిమాల్లో ఇద్దరు నటీమణులు హీరోయిన్లుగా నటించగా ... వాటి ద్వారా ఆ నటీమణులకు భారీ ఫ్లాప్స్ వచ్చాయి. ఇంతకు
రష్మిక రిజక్ట్ చేసిన ఆ మూవీలు ఏవి ..? అందులో నటించి అపజయాలను అందుకున్న ఆ బ్యూటీలు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం
చిరంజీవి "ఆచార్య" అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో
రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ లో
రామ్ చరణ్ కి జోడిగా
పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ లో మొదట
రామ్ చరణ్ కి జోడిగా
పూజా హెగ్డే స్థానంలో రష్మికను మేకర్స్ అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో
పూజా హెగ్డే ను ఆ
మూవీ లో హీరోయిన్గా తీసుకున్నారట. ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలాగే
తమిళ నటుడు తలపతి
విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్
మూవీ లో
పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ లో మొదట రష్మికను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత
పూజా హెగ్డేను ఆ మూవీలో హీరోయిన్గా తీసుకున్నారట. ఈ
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్
మూవీ లో మొదట
రష్మిక ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె ఆ
సినిమా నుండి తప్పుకోవడంతో
శ్రీ లీల ను ఆ
మూవీ లో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలా
రష్మిక రిజెక్ట్ చేసిన మూడు మూవీల ద్వారా
పూజా హెగ్డే ,
శ్రీ లీల ఇద్దరికి కూడా భారీ అపజయాలు అందినట్లు తెలుస్తోంది.