
ఏకంగా అంతమంది స్టార్స్ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ..?
కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భద్ర అనే సినిమాలో హీరో గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. మీరా జాస్మిన్ మూవీ లో హీరోయిన్గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. బోయపాటి శ్రీను ఈ మూవీ ని మొదట రవితేజతో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించగా తారక్ కి ఆ కథ నచ్చకపోవడంతో ఆయన ఈ మూవీ స్టోరీని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఇదే స్టోరీని బోయపాటి , అల్లు అర్జున్ కు వినిపించాడట. ఆయనకు కథ బాగానే నచినప్పటికీ అప్పటికే ఆర్య మూవీ కి కమిట్ అయి ఉండడంతో సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో బోయపాటి , రవితేజను సంప్రదించాడట. కథ మొత్తం విన్న రవితేజ ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి తారక్ , బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీలో రవితేజ హీరోగా నటించి అదిరిపోయే రేంజ్ విజయ్న్ని అందుకున్నట్లు తెలుస్తోంది.