
కోలీవుడ్‌లో అజిత్ ' గుడ్ బ్యాడ్ అగ్లీ ' ఊచకోత.... రోజుకు ఎన్ని కోట్లో తెలుసా...!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ & గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమా “ గుడ్ బ్యాడ్ అగ్లీ ” . అజిత్ ఫ్యాన్ అయిన దర్శకుడు అధిక్ రవి చంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా అజిత్ కెరీర్లో రికార్డు ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర దూసుకు పోతోంది. కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా ... ఓవర్సీస్ మార్కెట్లో సైతం అజిత్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా గా రికార్డులకు ఎక్కేసింది. ఓవర్సీస్ మార్కెట్లో అయితే కేవలం 5 రోజుల్లోనే ఎన్నో రికార్డులు బీట్ చేసింది. .
ఇక తమిళ గడ్డ పై అయితే ఈ సినిమా రోజుకు రు. 20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తూ యావరేజ్ గా దూసుకు పోతోంది. ఇలా అజిత్ స్టార్ డం చూపిస్తోందనే చెప్పాలి. కేవలం 5 రోజుల్లోనే తమిళనాడులో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల మార్క్ ని టచ్ చేసినట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో తమిళ నేలపై అజిత్ విధ్వంసం ఊచకోత రేంజ్ లో ఉందనే చెప్పాలి. . ఇక ఈ సినిమా దూకుడు చూస్తుంటే మరో పది రోజులకు పైగా ఇలాగే కొనసాగే లా కనిపిస్తోంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్లు ఎక్కడి వరకు వెళ్లి ఆగుతాయో ? చూడాలి. ఈ సినిమా ను మన తెలుగు వాళ్లు అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించగా జీవి ప్రకాష్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహం తో మైత్రీ వాళ్లు తమిళం లోనూ క్రేజీ ప్రాజెక్టులు నిర్మించే ఆలోచనలో అయితే ఉన్నారు.