ఊపిరి పీల్చుకోండి రా ఫ్యాన్స్..ఇక అన్ని మంచి రోజులే..!

frame ఊపిరి పీల్చుకోండి రా ఫ్యాన్స్..ఇక అన్ని మంచి రోజులే..!

Thota Jaya Madhuri
ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెగా అభిమానులు - అల్లు  అభిమానులు దారుణాతి దారుణంగా మాటలు యుద్ధం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.  ఒకరకంగా వార్ అనే చెప్పాలి.  అంటే సోషల్ మీడియా లోనే కొట్టుకొని చచ్చిపోయేలా హీట్ పెంచేశారు . పవన్ కళ్యాణ్ పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదు అని .. అల్లు అర్జున్ ని కావాలనే పవన్ కళ్యాణ్ హింసిస్తున్నాడు అని ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాలుగా మాట్లాడుకున్నారు . అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించకపోవడం ..అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ దగ్గరుండి బెయిల్ ఇప్పించడం .. ఆ తర్వాత మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ స్వయంగా మీట్ అయ్యి థాంక్స్ చెప్పడం జరిగింది .



కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు . దీంతో పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నాడు అని అల్లు అర్జున్ ని ఇంకా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ప్రారంభించారు ఫ్యాన్స్.  అయితే ఇప్పుడు సీన్  మొత్తం రివర్స్ అయిపోయింది . సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ అదేవిధంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కలిసి పోయారు . దానికి కారణం రీసెంట్ గానే అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి కలిసి పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకరును పరామర్శించారు.  మనకు తెలిసిందే మార్క్ శంకర్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది.



మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకునే స్కూల్లో యాక్సిడెంట్ జరిగింది . అక్కడ ఆ చిన్నారి బాగా తీవ్రంగా గాయపడ్డారు . రీసెంట్ గానే ఇండియాకి తిరిగి వచ్చారు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు కలిసి వెళ్లి మరి మార్క్ శంకరును పరామర్శించారు.  ఇదే మూమెంట్లో పవన్ కళ్యాణ్ తో ఆయన గంట సేపు పాటు మాట్లాడారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఇన్నాళ్లు నువ్వా నేనా ..నువ్వు తోపు.. నేను తోపు అని కొట్టుకొని చచ్చిపోయిన ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోండి అంటూ కామన్ పీపుల్స్ కూడా కన్వీన్స్  గా కామెంట్స్ చేస్తున్నారు.  వాళ్లు వాళ్లు ఒకటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు.. ఫైనల్లి కలిసిపోతారు . మీరు మీ లైఫ్ పై కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్యాన్స్  అంటూ  చాలామంది మీమ్‌స్ రూపంలో ట్రెండ్ చేస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ మీటింగ్ సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: