భర్తతో కలిసి సాయం చేసిన తాప్సీ.. ఈ బ్యూటీ మనసుకు వావ్ అనాల్సిందే!

frame భర్తతో కలిసి సాయం చేసిన తాప్సీ.. ఈ బ్యూటీ మనసుకు వావ్ అనాల్సిందే!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన తాప్సీకి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలోనే క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా ఈ బ్యూటీకి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గతేడాది తాప్సీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం జరిగింది. మొదట రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్న తాప్సీ తర్వాత మథియాస్ బోను అధికారికంగా పెళ్లి చేసుకున్నారు.
 
ప్రస్తుతం తాప్సీ హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాప్సీ చివరిసారిగా ఫిర్ అయి హసీన్ దిల్ రూబా అనే సినిమాలో నటించారు. గతంలో రిలీజైన ఒక సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డుంకీ సినిమాలో ఆమె నటించారు. ప్రస్తుతం తాప్సీ గాంధారీ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. దేవాశిష్ మఖీజా డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
 
యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా కనికా థిల్లాన్ ఈ సినిమాకు కథ అందించడం గమనార్హం. తాజాగా తాప్సీ మంచి మనస్సును చాటుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న పేదలకు తాప్సీ టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేయడం గమనార్హం. పేదలకు సహాయం చేసిన ఈ బ్యూటీ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
 
తాప్సీ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. తాప్సీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. తాప్సీ పాన్ ఇండియా ప్రజెక్ట్ లలో నటిస్తే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ ఉంది. హీరోయిన్ తాప్సీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. తాప్సీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాప్సీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. తాప్సీ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: