మెగాస్టార్
చిరంజీవి గతంలో నటించిన 'భోళా శంకర్'
సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో తన తరువాత సినిమాపై చిరు పూర్తి ఫోకస్ పెట్టారు.’బింబిసార' సినిమాతో
బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్
డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో
మెగాస్టార్ 'విశ్వంభర' అనే బిగ్గెస్ట్ పాన్
ఇండియా మూవీ మొదలు పెట్టారు.. ఈ
సినిమా కాన్సెప్ట్ టీజర్ చూసాక మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. కానీ టీజర్ రిలీజయ్యాక ఈ
సినిమా పరిస్థితి వేరే లా మారింది...టీజర్ లో విజువల్స్, వీఎఫెక్స్ చాలా పూర్గా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో వీఎఫెక్స్ మీద మళ్లీ కొత్తగా పని చేయడం మొదలుపెట్టారు.
వీఎఫ్ఎక్స్ కారణంగా
సంక్రాంతి రిలీజ్ అనుకున్న
సినిమా కాస్త వాయిదా పడిపోయింది. వేసవిలో అయినా
సినిమా రిలీజవుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కొన్ని నెలలుగా
సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు..తాజాగా
మెగాస్టార్ అనిల్ రావిపూడి తో,
శ్రీకాంత్ ఓదెలతో కొత్త సినిమాలు మొదలు పెట్టగా.. విశ్వంభర పై బజ్ తగ్గి పోయింది..ఇదిలా ఉంటే ఈ
సినిమా రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..షూటింగ్ చివరి దశకు చేరడంతో త్వరగా VFX పనులు పూర్తి చేసి జులై 24 న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..
గతంలో
మెగాస్టార్ నటించిన బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’
సినిమా కూడా ఇదే డేట్ న రిలీజ్ అయింది..దీనితో మేకర్స్ విశ్వంభర కు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.. ఈ నెల 12 న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో
మెగాస్టార్ సరసన సీనియర్
బ్యూటీ త్రిష
హీరోయిన్ గా నటిస్తుంది..
ఆస్కార్ విన్నర్
కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..