
డబల్ హిట్ కి దగ్గరగా మ్యాడ్ స్క్వేర్.. ఇప్పటివరకు వచ్చిన లాభాలు తెలిస్తే షాక్ కావాల్సిందే..?
10 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 12.46 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.68 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.53 కోట్లు , ఈస్ట్ లో 2.14 కోట్లు , వెస్ట్ లో 1.14 కోట్లు , గుంటూరు లో 1.97 కోట్లు , కృష్ణ లో 1.65 కోట్లు , నెల్లూరు లో 97 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27.54 కోట్ల షేర్ ... 46.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 10 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2.02 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 5.95 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 10 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 35.51 కోట్ల షేర్ ... 63.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 22 కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 13.51 కోట్ల లాభాలను కూడా అందుకని హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే డబల్ ప్రాఫిట్స్ అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.