
ఆమె నటిస్తేనే సినిమా చేస్తా .. లేకపోతే నో చెప్పిన కళ్యాణ్ రామ్..!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి .. ఈ సినిమా ను యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్నాడు .. ఇక ఈ సినిమా ఏప్రిల్ 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. అయితే ఈ క్రమం లోనే స్టార్ యాంకర్ సుమ ఈ సినిమా యూనిట్ తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు .. అందులో భాగంగా కళ్యాణ్ రామ్ పలు ఆసక్తికర విషయాలు సుమ తో పంచుకున్నారు .. అలాగే విజయశాంతి నటించకపోతే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా చేయనని దర్శకడి కి క్లారిటీ గా చెప్పేసారట హీరో . అలాగే కథ బాగా నచ్చిన తల్లి పాత్ర కు విజయశాంతి మాత్రమే కళ్యాణ్ రామ్ మదిలో బాగా మెదిలారట ..
అందుకే విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేస్తానని , లేకపోతే ఈ సినిమా ను పక్కన పెడతానని కళ్యాణ్ రామ్ క్లియర్గా చెప్పేసాడట ..ఇక ఆ తర్వాత ఈ కథను విజయశాంతి ఒప్పుకోవటం తో సినిమా షూటింగ్ కు వెళ్ళింది .. కాగా ఈ సినిమాకి అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండ గా ... ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా సినిమాను నిర్మించారు .. అలాగే ఈ సినిమా లో కళ్యాణ్ రా కు జంటగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది .. ఇక మరి ఈ సినిమాను ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .. ఇక మరి ఈ సినిమా తో అయినా కళ్యాణ్ రామ్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి .. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ మళ్లీ సరైన సక్సెస్ చూడలేదు .. అయితే ఇప్పుడు “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” సినిమాపై మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి .. ఇక మరి ఈ సినిమా ఆ అంచనాలుగు తగ్గట్టు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో కూడా చూడాలి .