అత్యంత తక్కువ నిడివితో గుడ్ బ్యాడ్ అగ్లీ.. కలిసొచ్చేనా..?

frame అత్యంత తక్కువ నిడివితో గుడ్ బ్యాడ్ అగ్లీ.. కలిసొచ్చేనా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయనకు కెరియర్లో ఎన్నో విజయాలు ఉన్న ఈ మధ్య కాలంలో మాత్రం అజిత్ కి సరైన విజయం దక్కలేదు. వరుస పెట్టి సినిమాలతో అజిత్ ప్రేక్షకులను పలకరిస్తున్న భారీ బ్లాక్ బాస్టర్ విజయం మాత్రం అజిత్ కి దక్కడం లేదు.

\

ఇది ఇలా ఉంటే అజిత్ తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో అజిత్ కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ , అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని కేవలం 2 గంటల 19 నిమిషాల 23 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 2 గంటల 19 నిమిషాలు రన్ టైమ్ అనేది తక్కువ నిడివి కాకపోయినా స్టార్ హీరోల సినిమాలకు ఇది తక్కువ నిడివి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాపై ప్రస్తుతం తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ak

సంబంధిత వార్తలు: