గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కు ఇక్కడ అంత సీన్ ఉందా ..?
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ సినిమాలో కూడా ఇటీవల ప్రియాంక చోప్రాన్ని సంప్రదించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. ఇక ఇందులో కూడా అల్లు అర్జున్ కు జంటగా లేదా ఇంకేదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది కూడా తెలియాల్సి ఉంది .. ప్రస్తుతానికైతే ఇది గాసిప్ స్టేజీలోనే ఉంది కాబట్టి ఇంకా క్లారిటీగా ఎవరూ చెప్పలేరు .. అయినా సరే ఎప్పుడో ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ బామకు ఇలా దర్శకులు క్యూ కట్టడం కొంత ఆశ్చర్యమే .. అయితే టాలీవుడ్ కు సంబంధించి ఇప్పటిదాకా జంటగా నటించింది ఒక రామ్ చరణ్ కు మాత్రమే . జంజీర్ (తెలుగు వెర్షన్ తుఫాన్) ఈ మూవీ ఎంత దారుణంగా ప్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
వీటి సంగతి ఇలా ఉంచితే ప్రియాంక చోప్రా గ్లోబల్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది .. హాలీవుడ్ సినిమాలు తో పాటు సిటాటిల్ వెబ్ సిరీస్ తోను ఈమెకు మంచి మార్కెట్ వచ్చింది .. అలాగే నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్నాక కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబైలోని గడుపుతుంది .. రాజమౌళి పిలుపు వస్తే షూటింగుల్లో పాల్గొంటుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నట్టు సమాచారం .. ఇదంతా ఎలా ఉన్నా మహేష్ రాజమౌళి సినిమాలో అవకాశం రావడం మాత్రం ప్రియాంక చోప్రా అదృష్టమే .. 1000 కోట్ల సినిమాలో ఈమె భాగం కావడం కన్నా నాలుగు పదులు వయసు దాటిన హీరోయిన్ కోరుకునేది ఇంకేముంటుంది . మరి ప్రియాంక చోప్రా టాలీవుడ్ లో ఇంకేం అవకాశాలు అందుకుంటుందో చూడాలి .