టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో శ్రీ లీల ఒకరు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు తెలుగులో ఎనిమిది సినిమాల్లో నటించింది. అందులో చాలా వరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు ఏవి ..? అందులో ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
శ్రీ లీల , రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన ధమాకా అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ స్కంద అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఈమె బాలకృష్ణ హీరో గా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె ఆది కేశవ మూవీ లో హీరోయిన్గా అనిపించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే ఈ బ్యూటీ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ నటి నటించిన గుంటూరు కారం సినిమా పర్వాలేదు అనే స్థాయి అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా అపజయం అందుకొనే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.