
రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఊ అంటావా మామకి మించి పోవాల్సిందే..!?
ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాడు అనేది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ మాదిరే "పెద్ది" సినిమాలో రామ్ చరణ్ లుక్స్ ఉన్నాయి అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు. నిజమే.. చాలావరకు దాదాపు 80% అలానే లుక్స్ ఉన్నాయి . కానీ సినిమా స్టోరీ వేరు కావచ్చు.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ నటిస్తుంది . కాగా ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించబోయే హీరోయిన్ ఎవరు అంటూ బాగా టాక్ వినిపిస్తుంది .
ఈ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కోసం చాలామంది టాప్ హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట బుచ్చిబాబు. అయితే అందరూ కూడా రిజెక్ట్ చేశారట . రష్మిక మందన - శ్రీలీల్- సమంత.. ఇలాంటి టాప్ హీరోయిన్స్ ని ఈ పాటలో చిందులు వేసే విధంగా అనుకున్నారట. కానీ అందరూ రిజెక్ట్ చేసారట . ఫైనల్లీ పూజ హెగ్డే ఈ పాటలో చిందులు వేయడానికి ఓకే చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సాంగ్ కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించబోతున్నారట . పూజా హెగ్డే ఈ సాంగ్ లో ఫోక్ స్టెప్స్ అదరగొట్టబోతున్నట్లు ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది..!