సర్దార్ 2 : టీజర్ రెడీ.. ఎన్ని నిమిషాల నిడివితో రానుందో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

frame సర్దార్ 2 : టీజర్ రెడీ.. ఎన్ని నిమిషాల నిడివితో రానుందో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
తమిళ నటుడు కార్తీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . కార్తీ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయి నా ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అ య్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టా లీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే కొంత కాలం క్రితం కార్తీ "సర్దార్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.


ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు బాక్స్ ఆఫీస్ ల దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సర్దార్ మూవీ కి కొనసాగింపుగా సర్దార్ 2 మూవీ ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సర్దార్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో సర్దార్ 2 పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కి సంబంధించిన పనులు అన్నీ పూర్తి అయినట్లు సమాచారం.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టీజర్ ఏకంగా 2 నిమిషాల 54 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ కనుక ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: