
ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన శృతి నారాయణన్
ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ వీడియో ఆ నటిది కాదని.. ఆమె ముఖాన్ని ఎడిట్ చేసి పెట్టారని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ ప్రైవేట్ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఆమె ఫ్యాన్స్ కు ఈ వీడియో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు ఆ హీరోయిన్ ఈ వీడియోపై స్పందించలేదు. ఇంతకీ ఆమె ఎవరంటే?తమిళ నటి శృతి నారాయణన్ గురించి పరిచయం అనవసరం. ఈ ప్రైవేట్ వీడియో ఉన్నది నటి శృతి నారాయణన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అన్ని సోషల్ మీడియా మధ్యమాల్లో శృతి నారాయణన్ హ్యాష్ ట్యాగ్ అంటూ పోస్ట్ చేశారు. ఈమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియోపై స్పందించింది.
హీరోయిన్ శృతి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ లో ఒకేలా ఉన్న ఓ అమ్మాయి AI వీడియోని షేర్ చేసింది. ఇందులో ఎవరు నిజమైన మనిషి.. ఎవరు AI తయారుచేసిన మనిషి అనేది చెప్పాలని శృతి ప్రశ్నించింది. ఇప్పుడున్న టెక్నాలజీతో, AIతో ఇలాంటివి చాలా చెయ్యచ్చు అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో, ప్రచారం అంతా తప్పుడు ప్రచారమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.