అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరంటే?
హీరో వైష్ణవ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ, మెగా స్టార్ చిరంజీవి నటించిన ఎం.బి.బి.ఎస్, అందరివాడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించాడు. బాలనటుడిగా వైష్ణవ్ తేజ్ నటించి మంచి హిట్ కొట్టాడు. వైష్ణవ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలన్ని హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలే. అప్పట్లో అందరూ స్టార్ హీరోలతో నటించాడు. అలాగే అతను నటించిన సినిమాలు అన్ని హిట్ కొట్టిన సినిమాలే.
టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఇతను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ఇతను ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఉప్పెన సినిమా ఒక రొమాంటిక్ డ్రామా. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతోనే ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఉప్పెన మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రంగ రంగ వైభవంగా, కొండపొలం, ఆదికేశవ సినిమాలలో నటించాడు.బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు.