రామ్ చరణ్ "ఆరెంజ్" ఫ్లాప్ కు 5 కారణాలు ఇవే!

frame రామ్ చరణ్ "ఆరెంజ్" ఫ్లాప్ కు 5 కారణాలు ఇవే!

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఓయ్, 7G బృందావన కాలనీ, ఆరెంజ్, గబ్బర్ సింగ్, మురారి, ఇంద్ర, భద్రి, త్రీ, లీడర్, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి. సినిమాలతో సమానంగా రీరిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
అయితే ఇప్పటికే ఆరెంజ్ మూవీ చాలా సార్లు రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదట థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ రీరిలీజ్ లలో మాత్రం ప్రతిసారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కోట్లలో కలెక్షన్ ని రాబట్టింది. ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పచ్చు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించారు. హీరోయిన్ గా జెనీలియా నటించింది. ఈ సినిమాలో  బ్రహ్మానందం, సీనియర్ హీరో నాగబాబు ముఖ్యపాత్రలలో కనిపించారు. ఇక ఈ మూవీ రీరిలీజ్ కోసం ప్రతిసారీ చాలా మంది అభిమానులు ఎదురుచూసే వారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు మాత్రం మంచి హిట్ కొడుతుంది. రామ్ చరణ్ నటించిన ఈ లవ్ స్టోరీ ఎంటర్ టైనర్ మూవీ ఇటీవల ప్రేమికుల దినోత్సవానికి కూడా రీరిలీజ్ అయ్యింది.
మరి ఈ సినిమా అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలుసుకుందామా. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఐదు కారణాలు ఉన్నాయి. అవి ఎంతో ఇప్పుడు చూద్దాం.. ఆరెంజ్ సినిమాలో ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ జనాలకు సరిగ్గా అర్థం కాకపోవడం. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ విజయం తరవాత రామ్ చరణ్ పైన అంచనాలు పెరిగాయి. కానీ ఆరెంజ్ సినిమా ఆ అంచనాలు రిచ్ అవ్వకపోవడం. అలాగే హీరోయిన్ జెనీలియా నటన కొందరికి అతిగా అనిపించడం కూడా సినిమా ఫ్లాప్ కు ఒక కారణం అయ్యింది అనే టాక్ ఉంది. వీటితో పాటుగా ముగ్గురిని హీరో లవ్ చేయడం అప్పటి ట్రెండ్ కు సెట్ అవ్వలేదు. సినిమా పూర్తిగా ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో తీయడం, పెద్దగా మాస్ సీన్లు లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారు. ఇలా ఆరెంజ్ సినిమా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: