
హీరోల వేటలో మార్కో డైరెక్టర్: దిల్ రాజు మరో మల్టీస్టారర్ ..!
ఈ సినిమా కథకు ప్రాధాన్యం చాలా ఎక్కువ ఒకవేళ ఇందులో నటించే ఇద్దరు తెలుగు హీరోలా అయితే ఈ సినిమా తెలుగు మార్కెట్ కి ఫిక్స్ అవుతుందని టాక్ . కానీ దిల్ రాజు వ్యూహం మాత్రం దీన్ని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురావటమే .. అందుకే బాలీవుడ్ లేదా తమిళం , మలయాళం నుంచి ఓ పెద్ద హీరోని తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు . ఇక ఈ నిర్ణయాలపై క్లారిటీ వస్తే ఈ సినిమాపై అధికార ప్రకటన చెయ్యనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషనల్ డ్రైవ్ కూడా ఎంతో బలంగా ఉండబోతుందని టాక్ .. ఈ సినిమా థీమ్ యూనివర్సల్ గా ఉండటంతో సినిమాను పాన్ ఇండియా స్థాయిల్లో తీసుకురావాలని ఆలోచనలు ఉన్నారట .. కథే కాకుండా సినిమాల ప్రజెంటేషన్ కూడా మారుతున్న ఈ రోజుల్లో తెలుగు నిర్మాతలు జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేయటం ఎంతో కామన్ గా మారిపోయింది ..
అందుకే ఇది కేవలం రీజనల్ లెవెల్ లో ఆగిపోకుండా ఇతర భాషల్లోనూ చొరబడేలా ప్లాన్ చేస్తున్నారు . ఇక దిల్ రాజుకు మల్టీస్టారర్ సినిమాలపై ఎంతో అనుభవం ఉంది .. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , ఎఫ్2 వంటి సినిమాలు నిర్మించి భారీ విజయాలు అందుకోవటమే కాకుండా ఆ కాంబినేషన్లో బిజినెస్ పరంగా కూడా మంచి ఫలితాలు అందుకున్నాడు .. ఇక ఇప్పుడు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా మాస్ సబ్జెక్ట్ కమర్షియల్ హై లోని నడిచే సినిమా . బడ్జెట్ పరంగా కూడా భారీగానే ఫిక్స్ చేశారని టాక్ .. మ్యూజిక్ డైరెక్టర్ టెక్నికల్ టీమ్స్‌తో ఇప్పటికే చర్చలు పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఫోకస్ ఉన్నది మొత్తం ఇద్దరు హీరోల ఎంపిక పైనే ఉంది ఒకసారి ఈ సినిమాకు సంబంధించిన ఫిక్స్ అయితే షూటింగ్ ముహూర్తం ఎప్పుడు అనేది తెలిసిపోతుంది .. ప్రజెంట్ హనీఫ్ కూడా ఫుల్ టైం లో ఈ ప్రాజెక్టు కే పనిచేస్తున్నాడు .. తక్కువ టైంలో సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు . ఇక మరి దిల్ రాజు , హనీఫ్ కాంబోలో రాబోయే ఈ మల్టీ స్టార్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి .